జై, కలర్స్ స్వాతి, షాజన్‌పదంసి ప్రధానపాత్రధారులుగా జెఎన్‌ఆర్ పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘లవ్‌జర్నీ’. శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజు (మార్చి16) విడుదల కావాల్సి ఉండగా మద్రాసు హైకోర్టు ఆదేశాలతో సినిమా విడుదల ఆగి పోయింది. అందనిది అందినట్లుగా డైరీలో రాసుకుంటూ తియ్యని అనుభూతికి లోనయ్యే ఓ యువకుడి ప్రేమకథలోని మలుపులను ‘లవ్ జర్నీ’గా తెరకెక్కించారు. తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘కనిమొళి’ చిత్రానికి ఇది రీమేక్.
ఈ సినిమాలో నటించిన నటి సోనా మద్రాసు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సినిమా సహ నిర్మాతలలో ఒకరైన సోనాను సంప్రదించకుండా తెలుగులో విడుదలకు రంగం సిద్ధం చేయడంతో ఆమె కోర్టు ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలు లేకుండా ఈ సినిమా విడుదల చేయడానికి వీల్లేదని నిషేదం విధించింది. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: సతీష్ చక్రవర్తి, సహ నిర్మాత: మాస్టర్ ఉదయ్ తేజ, నిర్మాణ సారథ్యం: జక్కుల సుజాత, సమర్పణ: తిరుమలరెడ్డి, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు, దర్శకత్వం: శ్రీప
Post a Comment